సాగు చట్టాలు రద్దయిన వేళ.. అన్నదాతల తదుపరి అడుగిదే..

ఏడాది పొడవునా నిరసనలు సాగించి, ఎలాంటి అవాంతరాలకు తలొగ్గకుండా సాగు చట్టాలకు రద్దు చేయించుకున్న రైతన్నలు..తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. మిగిలిన రైతు సమస్యలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీనే ఇకనుంచి ప్రభుత్వంతో చర్చలు జరపనుందని వెల్లడించారు. ఈ మేరకు శనివారం దిల్లీ సమీపంలో సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించింది.

Published : 04 Dec 2021 22:14 IST

దిల్లీ: ఏడాది పొడవునా నిరసనలు సాగించి, ఎలాంటి అవాంతరాలకు తలొగ్గకుండా సాగు చట్టాలు రద్దు చేయించుకున్న రైతన్నలు..తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. మిగిలిన రైతు సమస్యలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీనే ఇకనుంచి ప్రభుత్వంతో చర్చలు జరపనుందని వెల్లడించారు. ఈ మేరకు శనివారం దిల్లీ సమీపంలో సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించింది.

దిల్లీ సరిహద్దులో రైతులు నిరసనలు కొనసాగించడంపై కూడా చర్చ జరిగింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, నిరసనల్లో భాగంగా రైతులపై నమోదైన కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్లతో సరిహద్దులో ప్రస్తుతానికి వారి ఆందోళనను కొనసాగించనున్నారు. ఇదిలా ఉండగా.. రైతు సమస్యలపై చర్చించడానికి తమకు నిన్నరాత్రి కేంద్రం నుంచి పిలుపు వచ్చిందని రైతు సంఘాలు వెల్లడించాయి. కేంద్రమంత్రి అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ప్రభుత్వం కోరినట్లే సమావేశం కోసం కమిటినీ ఏర్పాటు చేశామన్నారు. అయితే అధికారికంగా ఆహ్వానం అందాల్సి ఉందన్నారు. 

గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై కొన్ని రాష్ట్రాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. వారు దిల్లీ సరిహద్దులో ఏడాది కాలంగా తమ ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో కేంద్రం ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పార్లమెంట్‌ శీతకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టింది. మొదటి రోజే ఉభయ సభల్లో దానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు