Humanoid robot: ‘మీ ఫేషియల్ ఫీచర్స్ ఇస్తారా.. రూ. 1.5కోట్లు చెల్లిస్తాం’
తమ ఫేషియల్ ఫీచర్స్‌కు సంబంధించిన శాశ్వత హక్కులను ఎవరైనా ఇస్తే దాదాపు రూ.1.5 కోట్లు చెల్లిస్తామని ప్రోమోబోట్ అనే సంస్థ ప్రకటించింది.....
ఇంటర్నెట్ డెస్క్: హ్యూమనాయిడ్ రోబో అసిస్టెంట్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ.. వాటికి మరింత సహజమైన ముఖ స్వరూపం తీసుకొచ్చేందుకుగానూ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైనా తమ ఫేషియల్ ఫీచర్స్‌కు సంబంధించిన శాశ్వత హక్కులను ఇస్తే దాదాపు రూ.1.5 కోట్లు చెల్లిస్తామని తెలిపింది. రోబోటిక్స్‌లో ఫేషియల్ రికగ్నిషన్, నావిగేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న ప్రోమోబోట్ సంస్థ.. చూడటానికి స్నేహపూర్వకంగా కనిపించే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో సహాయకులుగా వ్యవహరించే రోబోలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.
వంద గంటల స్పీచ్ రికార్డింగ్
ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసిన ఈ సంస్థ.. తుది ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎంపికైన వ్యక్తులకు సంబంధించి మొదటి దశలో.. ముఖం, శరీరానికి సంబంధించిన 3డీ ఆకృతులను తీసుకుంటారు. అనంతరం.. వారి గొంతుతో దాదాపు 100 గంటలపాటు స్పీచ్ మెటీరియల్ రికార్డ్ చేస్తారు. చివరగా.. సంబంధిత లైసెన్స్ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ రూపొందించిన ప్రోమోబోట్ వీ4 రోబోలు విశ్వవిద్యాలయాలు, విమానాశ్రయాలు తదితర చోట్ల సేవలందిస్తున్నాయి. గైడ్ మొదలు.. అడ్మినిస్ట్రేటర్, కన్సల్టెంట్ ఇలా అనేక విధులు నిర్వహిస్తాయి.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..