Vaccine For Children: చిన్నారులకు టీకా.. అమెరికా కీలక నిర్ణయం

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు టీకాలు అందించేందుకు ఫైజర్ కొవిడ్ టీకాకు ఆమోదం తెలిపింది.

Updated : 30 Oct 2021 15:28 IST

వాషింగ్టన్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు టీకాలు అందించేందుకు ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపింది. అక్కడి అత్యున్నత స్థాయి నిపుణుల బృందం ఇచ్చిన అనుమతి మేరకు ఈ ప్రకటన వెలువడింది. టీకా పొందడం వల్ల దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆ బృందం స్పష్టం చేసింది. ఫలితంగా 28 మిలియన్ల మంది అమెరికన్ చిన్నారులకు టీకా లభించనుంది.

‘తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాల సిబ్బంది, చిన్నారులు ఈ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఒక తల్లిగా, వైద్యురాలిగా నాకు ఈ విషయం తెలుసు. చిన్నారులకు టీకా అందడం వల్ల మనం సాధారణ పరిస్థితులకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది’ అని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) కమిషనర్ జానెట్ వుడ్‌కాక్ వెల్లడించారు. కాగా, కొద్ది రోజుల్లో ఈ టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే చైనా, చిలీ, క్యూబా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చిన్నారులకు టీకా అందిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని