Omicron: కొత్త వేరియంట్‌తో ఒక్క మరణం కూడా లేదు..కానీ!: WHO 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏ మేరకు.....

Updated : 29 Nov 2021 21:56 IST

జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏ మేరకు ఉంటుందో అనే దానిపై మాత్రం అనిశ్చితి నెలకొని ఉందని వెల్లడించింది. ఈ కొత్త రకం వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 

‘ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఈరోజు వరకు ఈ కొత్త వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదుకాలేదు’ అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారం దక్షిణాఫ్రికాలో ఈ కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ వేరియంట్‌లోని అసాధారణ మ్యుటేషన్లపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దానిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా వర్గీకరించి.. ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. ఇది ఇప్పటివరకు వెలుగు చూసిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేర్చింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ మాత్రమే ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 దేశాలకు పైగా ఒమిక్రాన్‌ వ్యాపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని