ప్రపంచంలో ప్రతి 10మందిలో ఒకరికి కొవిడ్‌!

ప్రపంచ జనాభాలో పది మందిలో ఒకరు కొవిడ్‌ బారిన పడి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. డబ్ల్యూహెచ్‌వో ఉన్నత స్థాయి అత్యవసర నిపుణుడు నిపుణుడు మైక్‌ ర్యాన్‌ సోమవారం ఓ సమావేశంలో ఆ విషయాన్ని వెల్లడించారు.

Published : 06 Oct 2020 01:59 IST

జెనీవా: ప్రపంచ జనాభాలో ప్రతి పది మందిలో ఒకరు కొవిడ్‌ బారిన పడి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. డబ్ల్యూహెచ్‌వో ఉన్నత స్థాయి అత్యవసర నిపుణుడు మైక్‌ ర్యాన్‌ సోమవారం ఓ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా 10శాతం మంది కొవిడ్‌ బారిన పడ్డట్లు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. దేశం, గ్రామీణ, నగర ప్రాంతాలను బట్టి దీని ప్రభావం మారుతోంది. వ్యాధి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మనం ఇప్పుడు సంక్లిష్టమైన కాలంలోకి వెళ్తున్నాం’ అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ పుట్టుకపై విచారణలో భాగంగా చైనా వెళ్లే నిపుణులకు సంబంధించిన జాబితాను చైనా అధికారుల పరిశీలన కోసం సమర్పించినట్లు  తెలిపారు. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోందని.. యూరప్‌ సహా తూర్పు మధ్య ప్రాచ్యంలోని ప్రాంతాల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని మైక్‌ ర్యాన్‌ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని