Rahul gandhi: ‘ధన్యవాదాలు మోదీ.. పండుగల వాతావరణాన్ని నిస్తేజంగా మార్చారు’

పెట్రోల్‌, డీజిల్‌తోపాటు నిత్యవసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ‘పెట్రోల్‌, డీజిల్‌, నిత్యవసర సరకులు, వంట గ్యాస్‌ ధరలు పెరుగుతూ...

Published : 08 Oct 2021 23:31 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌తోపాటు నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ‘పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరకులు, వంట గ్యాస్‌ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ధన్యవాదాలు మోదీ.. పండుగల వాతావరణాన్ని నిస్తేజంగా మార్చారు’ అని ట్వీట్‌ చేశారు. ధరల పెంపుపై ఓ వార్త సంస్థ కథనాన్ని దీనికి జోడించారు. ‘రికార్డు స్థాయిలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు పెట్రోల్‌ రేట్లే కారణం.. దాని ధర పెరుదగులకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత’ అంటూ రాహుల్‌ గాంధీ గతంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. రోజురోజుకు సరికొత్త గరిష్ఠాలను తాకుతూ, సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరపై అదనంగా రూ.15 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గత రెండు నెలల వ్యవధిలో వంటగ్యాస్‌ ధరను పెంచడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే 2021లో వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.205 పెరిగింది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని