Third wave: థర్డ్‌వేవ్‌ రావడం కాదు.. అది ఇక్కడే ఉంది.. జాగ్రత్త!

కరోనా మూడో దశ ఇప్పటికే వచ్చేసిందని ముంబయి మేయర్‌ కిశోరి పెండేకర్‌ అన్నారు. వినాయక చవితి వేడుకలు ఇంట్లోనే జరుపుకొంటానన్న ఆమె.....

Published : 07 Sep 2021 17:38 IST

ముంబయి మేయర్‌ హెచ్చరిక

ముంబయి: కరోనా మూడో దశ ఇప్పటికే వచ్చేసిందని ముంబయి మేయర్‌ కిశోరి పెండేకర్‌ అన్నారు. వినాయక చవితి వేడుకలు ఇంట్లోనే జరుపుకొంటానన్న ఆమె.. తానెక్కడికీ వెళ్లడం లేదన్నారు. ‘కరోనా థర్డ్‌ వేవ్‌ రావడం కాదు.. అది ఇక్కడే ఉంది’ అంటూ మంగళవారం ఆమె మీడియాతో అన్నారు. నాగ్‌పూర్‌లో కూడా ఇప్పటికే దీన్ని ప్రకటించారని తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న ప్రారంభం కాబోతున్న వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు.

మరోవైపు, మహారాష్ట్రలో రోజువారీ కేసులు స్వల్పంగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా అక్కడి రాజకీయ పార్టీలను అప్రమత్తం చేశారు. రాబోయే పండుగ సీజన్‌ అత్యంత కీలకమని, కొవిడ్‌ నియంత్రణలో ఇదో సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ మన ఇంటి ముంగిటే ఉందంటూ పార్టీలకు హెచ్చరించారు. కేరళలో రోజుకు దాదాపు 30వేల కేసులు రావడం ఆందోళనకరమన్న ఆయన.. దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మహారాష్ట్ర భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ఆయన నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని