​​​​​​పెట్రో మంట.. ఆ సర్కారు చలవ ₹1!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్న వేళ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రజలపై కాస్త కనికరం చూపింది. లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై చెరో రూపాయి తగ్గించింది. సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి..

Published : 21 Feb 2021 17:31 IST

కోల్‌కతా: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్న వేళ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రజలపై కాస్త కనికరం చూపింది. లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై చెరో రూపాయి తగ్గించింది. సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అమిత్‌ మిత్రా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కొంతమేర ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు.

పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90 పన్ను విధిస్తుంటే రాష్ట్రం రూ.18.46 మాత్రమే వసూలు చేస్తోందని ఈ సందర్భంగా అమిత్‌ మిత్రా పేర్కొన్నారు. అలాగే డీజిల్‌పై కేంద్రం రూ.31.80 సంపాదిస్తుంటే రాష్ట్రం రూ.12.77 మాత్రమే పన్ను వేస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయం రాకుండా కేంద్రం సెస్సులు వసూలు చేస్తోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని