Terror Attack: దేశంలో ఉగ్రదాడికి పాక్‌ కుట్ర.. టిఫిన్‌ బాక్స్‌ బాంబు స్వాధీనం

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌లో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌, మరికొన్ని పేలుడు పదార్థాలు లభించాయి....

Published : 09 Aug 2021 16:33 IST

చండీగఢ్‌: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌లో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌, మరికొన్ని పేలుడు పదార్థాలు లభించాయి. కాగా వీటిని డ్రోన్‌ సాయంతో జారవిడిచినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న అమృత్‌సర్‌లోని దలేకా గ్రామం వద్ద పోలీసులు ఓ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్వ్కాడ్‌ సాయంతో వాటిని తెరవగా అందులో 2 కిలోల టిఫిన్‌ బాక్స్‌ బాంబు, 5 గ్రనైడ్‌లతోపాటు మరికొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్‌ డీజీపీ దిన్‌కర్‌ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి దలేకా గ్రామస్థులకు డ్రోన్‌ శబ్దాలు వినిపించాయి. ఈ విషయాన్ని వారు స్థానిక సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సరిహద్దుకు సమీపంలో ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో టిఫిన్‌ బాక్స్‌లో ఆర్డీఎక్స్‌, 5 గ్రనైడ్‌లు, మూడు డిటోనేటర్లు, ఓ రిమోట్‌తోపాటు మరికొన్ని పరికరాలు లభించినట్లు డీజీపీ తెలిపారు. అయితే ఈ బ్యాగును అత్యాధునిక డ్రోన్‌ సాయంతో జారవిడిచినట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని