బ్రిటన్‌: అసాంజేను అమెరికాకు అప్పగించం..

 ప్రముఖ వికీ లీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేను తమకు  అప్పగించాలన్న అమెరికా వాదనను బ్రిటన్‌ కోర్టు తోసిపుచ్చింది.  ఈ మేరకు బ్రిటన్‌లోని జిల్లా జడ్జి వానెస్సా బారైట్సర్‌  తీర్పునిచ్చారు.   అమెరికా కస్టడీలోకి వెళ్తే ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు...

Published : 04 Jan 2021 21:33 IST

లండన్‌:  ప్రముఖ వికీ లీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేను తమకు  అప్పగించాలన్న అమెరికా వాదనను బ్రిటన్‌ కోర్టు తోసిపుచ్చింది.  ఈ మేరకు బ్రిటన్‌లోని జిల్లా జడ్జి వానెస్సా బారైట్సర్‌  తీర్పునిచ్చారు.   అమెరికా కస్టడీలోకి వెళ్తే ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.  

  ‘ఒకవేళ అసాంజేను యూఎస్‌కు అప్పగిస్తే  ఆయనకు  బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. దీంతో ఆయన  తట్టుకోలేక  ఆత్యహత్యకు పాల్పడే అవకాశాలున్నాయి. కావున  బెయిల్‌ వచ్చే వరకు అసాంజే రిమాండ్‌లోనే ఉండాలి’అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.  కోర్టు నిర్ణయం అనంతరం ఆయనకు కాబోయే భార్య స్టెల్లా మోరిస్‌, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు.  అమెరికా రహస్యాలను ఆన్‌లైన్‌లో ప్రచురించారనే ఆరోపణలతో అసాంజే కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని