ఇకపై అక్కడ టీవీలో జంక్‌ఫుడ్స్‌ యాడ్స్‌ నిషేధం

టెలివిజన్‌లో ప్రసారమయ్యే జంక్‌ ఫుడ్‌ ప్రకటనలపై  బ్రిటన్‌ ప్రభుత్వ కఠిన చర్యలకు దిగనుంది.

Published : 25 Jun 2021 17:22 IST

పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయం

లండన్‌: టెలివిజన్‌లో ప్రసారమయ్యే జంక్‌ ఫుడ్‌ ప్రకటనలపై  బ్రిటన్‌ ప్రభుత్వ కఠిన చర్యలకు దిగనుంది. యువత ఊబకాయం బారిన పడుతున్న నేపథ్యంలో ప్రకటనలను నియంత్రించాలని నిర్ణయించింది. స్టేట్‌ ఫండెండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ అంచనా ప్రకారం.. నాలుగేళ్ల వయస్సులోపు పిల్లల్లో 10శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. అదే 10, 11 ఏళ్ల వయసు వారిలో 20.2 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ప్రతీ నలుగురిలో ఒకరికి ఊబకాయం ఉన్నట్లుగా ఇందులో తేలడంతో అప్రమత్తమైన ఆ దేశం వెంటనే హైక్యాలరీ ఫుడ్స్‌ని నియంత్రించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ముందుగా యాడ్స్‌ని నియంత్రించాలన్న కఠిన నిర్ణయాన్ని అమలు చేయనుంది.

ఇవే ఆ రూల్స్‌..

ఆరోగ్యశాఖ మంత్రి జో చర్చిల్‌ కొత్త పాలసీ విధానాన్ని వివరిస్తూ.. ‘‘వచ్చే ఏడాది చివరి నుంచి టీవీ ఛానళ్లలో తీపి, ఉప్పు..కొవ్వుశాతం అధికంగా ఆహార పదార్థాల యాడ్స్‌ను రాత్రి 9గంటల ముందు ప్రసారం చేయకూడదు. ఇది పూర్తిగా అనారోగ్యం నుంచి పిల్లలను కాపాడుకునేందుకే. తీపి, ఉప్పు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న 60శాతం యాడ్స్‌ టీవీలో ముఖ్యంగా సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటలకు ప్రసారం అవుతున్నాయి’’ అని వివరించారు.

ఆన్‌లైన్‌లో యాడ్స్‌ ఇవ్వొచ్చు...

ఈ కొత్త షరతులు కేవలం టీవీ వరకే వర్తిస్తాయని ఆన్‌లైన్‌లో ప్రమోషన్స్‌ చేసుకోవచ్చని స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌ ప్రమోషన్స్‌ చేసుకోవాలనుకుంటే వారి సోషల్‌మీడియా ఖాతాలతో పాటు బ్లాగ్స్‌లో ఇచ్చుకోవచ్చని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని