యూపీలో బలవంతపు మతమార్పిడి ఇక నేరమే!

బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం లభించింది. యూపీ ‘చట్టవిరుద్ధ మత మార్పిడుల బిల్లు 2020’కి గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ శనివారం ఆమోదం తెలిపారు.

Updated : 22 Dec 2022 17:18 IST

లఖ్‌నవూ: బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించారు. ‘యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడుల బిల్లు 2020’కి గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ శనివారం ఆమోదం తెలిపారు. ఇవాళ్టి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై ఎవరైనా వివాహం పేరుతో చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూ.50వేలు జరిమానా విధిస్తారు.

యూపీ చట్ట వ్యతిరేక మతమార్పిడుల బిల్లు-2020కి ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. వివాహం కోసం ఎవరైనా మతం మారాలనుకుంటే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. బలవంతంగా, మోసపూరితంగా మత మార్పిడి చేయడం లేదని నిరూపించాల్సిన బాధ్యత వివాహం చేసుకునే వ్యక్తులపై ఉంటుంది. కాగా, గత కొన్ని వారాలుగా భాజపా పాలిత రాష్ట్రాలైన యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాల్ని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని