UP election 2022: టికెట్ దక్కలేదని సమాజ్‌ వాదీ నేత ఆత్మహత్యాయత్నం

టికెట్‌ దక్కలేదని సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఆదిత్య ఠాకూర్ అనే నేత ఆత్మహత్యకు యత్నించారు. లఖ్‌నవూలోని తమ పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని

Published : 17 Jan 2022 01:40 IST

లఖ్‌నవూ: ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. మరికొందరు తీవ్ర ఆగ్రహానికి గురై స్నేహితులు, సన్నిహితుల వద్ద బోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఆదిత్య ఠాకూర్ అనే నేత ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు.

పార్టీ అభ్యర్థిత్వం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఠాకూర్ బోరున విలపించారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు. ‘ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశా. అలాంటిది నన్ను కాదని వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై పోసుకున్న పెట్రోల్ కళ్లలోకి పడటంతో ఠాకూర్ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో తొలిదశ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 125 మందితో తొలి జాబితా ప్రకటించింది. భాజపా, సమాజ్​వాదీ పార్టీలు సైతం పలువురు అభ్యర్థులను ఖరారు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని