Karnataka: సీఎంపై మహిళ ముద్దుల వర్షం.. వీడియో వైరల్
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ భిన్నంగా చాటుకుంది. సీఎం తన ఇంటికి రావడంతో సంతోషంలో మునిగితేలిన ఆమె..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ భిన్నంగా చాటుకుంది. సీఎం తన ఇంటికి రావడంతో సంతోషంలో మునిగితేలిన ఆమె.. ముఖ్యమంత్రి చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. దీంతో బొమ్మై ఒకింత ఇబ్బందికర పరిస్థితికి గురయ్యారు. అసలేం జరిగిందంటే..
జనసేవక కార్యక్రమంలో భాగంగా సీఎం బొమ్మై సోమవారం బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందుకు వెళ్లగా.. సీఎంను చూసిన సంతోషంలో అక్కడున్న ఓ మహిళ బొమ్మై కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టింది. ఆమె ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి అశ్వథ్ నారాయణ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ వారించారు. అయితే సీఎం చేతిపై మహిళ ఆపకుండా ముద్దులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి