Afghan Crisis: వాళ్లందరితో టచ్‌లో ఉన్నాం: భారత విదేశాంగ శాఖ

తాలిబన్ల కబంధ హస్తాల్లోకి జారిపోయిన ఆఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్నంటున్న పరిణామాలన్నింటినీ నిశితంగా ......

Updated : 16 Aug 2021 20:05 IST

దిల్లీ: తాలిబన్ల కబంధ హస్తాల్లోకి జారిపోయిన అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్నంటున్న పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులతో పోలిస్తే కాబుల్‌లో  పరిణామాలు వేగంగా మారుతున్నట్టు ఆ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. అఫ్గాన్‌లో నెలకొన్న భయానక పరిస్థితుల్లో స్వదేశానికి వచ్చేయాలనుకొంటున్న భారతీయులతో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు. 

అలాగే, అఫ్గాన్‌లో సిక్కు, హిందూ సంఘాల ప్రతినిధులతోనూ టచ్‌లో ఉన్నామని, అక్కడి నుంచి బయల్దేరాలనుకొనేవారికి తగిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టంచేశారు. కాబుల్‌ విమానాశ్రయం నుంచి విమానాల కమర్షియల్‌ ఆపరేషన్లు రద్దయ్యాయని, అందుకే స్వదేశానికి చేర్చే ప్రక్రియకు తాత్కాలిక విరామం ఇచ్చినట్టు తెలిపారు. విమాన సర్వీసులు పునరుద్ధరణ కోసం వేచిచూస్తున్నామన్నారు. అఫ్గాన్‌లో మన పౌరుల భద్రతతో పాటు మన దేశ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకొంటామని బాగ్చి స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు