Indian Army: ‘మనది శాంతికాముక దేశం.. అయినా తప్పలేదు’

దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తుల విషయంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. ఐక్యత, సమగ్రతను చెక్కుచెదరనీయొద్దని పిలుపునిచ్చారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Published : 13 Aug 2021 22:50 IST

దిల్లీ: దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తుల విషయంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. ఐక్యత, సమగ్రతను చెక్కుచెదరనీయొద్దని పిలుపునిచ్చారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ప్రపంచమంతా ఒకటేనన్న భావన మనది. ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. మరోవైపు స్వాతంత్ర్యం అనంతరం మన దేశం ఎన్నో దాడులను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆర్మీ, ఇతర భద్రతా దళాల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి వచ్చింది. శాంతికాముక దేశమైనా.. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో బలగాలకు యుద్ధ శిక్షణ ఇస్తున్నామ’ని వివరించారు. మిలిటరీ ఆధునికీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.  అంతకుముందు ఆయన దేశవాసులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భద్రతా బలగాలు.. పౌరులను కంటికి రెప్పలా కాపాడుకుంటాయని భరోసా ఇచ్చారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైతం శుక్రవారం ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని