Rafale: 24 గంటలు గడిచినా మౌనమెందుకు?

రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలన్న డిమాండ్‌ను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.....

Published : 04 Jul 2021 20:50 IST

రఫేల్‌ అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌

దిల్లీ: రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలన్న డిమాండ్‌ను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన కొన్ని కారణాలను ఉంచి వీటిలో ఏది సరైందని నెటిజన్లను అడిగారు. ఆయన ఉంచిన కారణాల్లో అన్నీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం.

‘‘మోదీ ప్రభుత్వం జేపీసీ దర్యాప్తునకు ఎందుకు సిద్ధంగా లేదు?- 1) తప్పుచేశామని బోధపడటం, 2) మిత్రులను కాపాడటం, 3) జేపీసీలో రాజ్యసభ సభ్యులు ఉండొద్దని, 4) పైవన్నీ’’ అని హిందీలో రాసిన ఆన్‌లైన్ సర్వేను ట్విటర్‌లో ఉంచారు.

మరోవైపు ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణకు ఆదేశించి 24 గంటలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధారాల ప్రకారం.. మధ్యవర్తులకు భారీ ముడుపులు అందినట్లు తెలుస్తోందన్నారు. యావత్‌ ప్రపంచం ఇప్పుడు దిల్లీ వైపే చూస్తోందన్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.

భారత్‌కు రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాకు ఉద్దేశించిన రూ.59 వేల కోట్ల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ మొదలైంది. ఇందుకోసం ఒక న్యాయమూర్తి కూడా నియమితులైనట్లు పరిశోధనాత్మక కథనాలను వెలువరించే ఫ్రెంచ్‌ వార్తా వెబ్‌సైట్‌ ‘మీడియాపార్ట్‌’ పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపా మధ్య మాటల యుద్ధం చెలరేగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు