Social Media: నిందితుల జాబితాలో సోషల్‌మీడియాను ఎందుకు చేర్చట్లేదు?: మద్రాస్‌ హైకోర్టు

ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వీడియోలు చూసి కొందరు నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదని తమిళనాడు పోలీసులను మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ యూట్యూబర్‌పై నమోదైన

Published : 22 Jan 2022 01:47 IST

చెన్నై: ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వీడియోలు చూసి కొందరు నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదని తమిళనాడు పోలీసులను మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ యూట్యూబర్‌పై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రశ్నను లేవనెత్తింది.

అసత్యాలతో వీడియోలు రూపొందిస్తున్నాడంటూ దురైమురుగన్‌ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. అతడికి బెయిల్‌ మంజురైంది. అయితే, నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పోలీసులు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఏ మాత్రం అనుమతించబోమని, నిందితుడు దురైమురుగన్‌ యూట్యూబ్‌ ద్వారా ఎంత సంపాదించాడో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

ఈ సందర్భంగా సోషల్‌మీడియా దుర్వినియోగంపై కోర్టు స్పందిస్తూ ‘‘కొంత మంది డబ్బు సంపాదన కోసం సోషల్‌మీడియాను దుర్వినియోగపరుస్తున్నారు. ఇంకొందరు గన్స్‌ ఎలా తయారు చేయాలో, దొంగతనాలు, మోసాలు ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నారు. ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో సోషల్‌మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చట్లేదు?’’అంటూ న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించింది. యూట్యూబ్‌ దుర్వినియోగం కాకుండా విధివిధానాలు రూపొందించాలని తమిళనాడు ఏడీజీపీ, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని