Published : 24/11/2021 18:46 IST

Rakesh Tikait: మా డిమాండ్లను నెరవేరిస్తేనే.. ఇంటికి వెళ్తాం: రాకేశ్‌ టికాయత్‌

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేసినా.. మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. వాటిని నెరవేరిస్తేనే ఆందోళన విరమించి, ఇంటిముఖం పడతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయత్‌ వెల్లడించారు. ‘కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసింది. కానీ, కనీస మద్దతు ధర, ఆందోళనలో అమరులైన 700 మంది రైతులకు పరిహారం, విద్యుత్‌ సవరణ బిల్లు.. రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి అజయ్‌ మిశ్రాను తొలగించాలన్న డిమాండ్లను జనవరి 26లోగా కేంద్రం నెరవేర్చాలి. అప్పుడే మేమంతా తిరిగి ఇంటికి వెళ్తాం’అని టికాయత్‌ తెలిపారు. 

30 ట్రాక్టర్లలో దిల్లీకి 500 మంది రైతులు..

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటానికి నవంబర్‌26తో ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో నవంబర్‌ 29న 500 మంది రైతులు 30 ట్రాక్టర్లలో ర్యాలీగా దిల్లీకి చేరుకుంటారని బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌ చెప్పారు. పూర్తి వివరాలు నవంబర్‌ 26న జరిగే సమావేశం తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. 

ఎన్నికలపై అప్పుడే మాట్లాడుతాం

వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల విషయంలో రైతు సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాంతాలకు చెందిన రైతులు కూడా రైతు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాకేశ్‌ టికాయత్‌ స్పందిస్తూ.. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత తాము ఎన్నికలపై మాట్లాడుతామని స్పష్టం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని