Women in NDA: వచ్చే ఏడాది నుంచే ఎన్‌డీఏలోకి మహిళల ప్రవేశం: రాజ్‌నాథ్‌ సింగ్

వచ్చే ఏడాది నుంచి నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మహిళలూ చేరవచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

Updated : 14 Oct 2021 22:22 IST

దిల్లీ: వచ్చే ఏడాది నుంచి నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మహిళలూ చేరవచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. సాయుధ దళాల్లో మహిళల పాత్ర గురించి షాంఘై సహకార సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో ఆయన పాల్గొని ఈ విషయాన్ని తెలియజేశారు. ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రవేశాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. తాజాగా మంత్రి ప్రకటనతో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు అయ్యింది.

‘వచ్చే ఏడాది నుంచి త్రివిధ దళాల్లో మహిళల ప్రవేశం ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో మహిళలకు మరిన్ని అవకాశాల కల్పనకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్‌డీఏలో మహిళల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేసి, పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించామని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని