83 movie: ఓటీటీలో ‘83’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సినీ, క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘83’. 1983లో భారత క్రికెట్‌ జట్టు తొలిసారి వరల్డ్‌ కప్‌ సాధించడం, క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు కబీర్‌ సింగ్‌. కపిల్‌ దేవ్‌గా నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, కపిల్‌ భార్య రోమి భాటియాగా దీపిక పదుకొణె నటించారు. 

Updated : 17 Sep 2022 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ, క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘83’. 1983లో భారత క్రికెట్‌ జట్టు తొలిసారి వరల్డ్‌ కప్‌ సాధించడం, క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు కబీర్‌ సింగ్‌. కపిల్‌దేవ్‌గా నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, ఆయన భార్య రోమి భాటియాగా దీపిక పదుకొణె నటించారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మొత్తం ఐదు భాషలు (తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో) స్ట్రీమింగ్‌ కానుంది. గతేడాది డిసెంబర్‌ 24న థియేటర్లలో విడుదలైన ‘83’ ప్రేక్షకుల, విమర్శల మెప్పు పొందింది. తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవా, కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని