రైతుల నిరసనలకు వ్యతిరేకంగా కంగన ట్వీట్‌

రైతుల నిరసనలకు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి తొలగించిన నటి కంగనా రనౌత్‌ ఈసారి భారత్‌ బంద్‌కు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది....

Updated : 08 Dec 2020 17:14 IST

 

దిల్లీ: రైతుల నిరసనలకు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి తొలగించిన నటి కంగనా రనౌత్‌ ఈసారి భారత్‌ బంద్‌కు వ్యతిరేకంగా ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే దేశం అట్టుడుకుతోందని, బంద్‌తో మరింత తీవ్రతరం చేస్తున్నారంటూ పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై కంగన మొదటి నుంచీ వ్యతిరేకత తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మరో  ట్వీట్‌ చేసింది. ‘రండి భారత్‌ను బంద్‌ చేసేద్దాం. ఈ పడవకు తుఫాన్ల కొరత లేనట్లు ఇప్పుడు మీరొచ్చి గొడ్డలితో పడవకు రంధ్రాలు చేయండి’ అంటూ నిరసనలకు మద్దతు తెలిపిన బంద్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేసింది. ఆద్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళనలపై మాట్లాడిన ఓ వీడియోను ఆ ట్వీట్‌కు జతచేస్తూ పోస్టుచేసింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు కొద్దిరోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారికి భారీగా మద్దతు లభిస్తోంది. ఆదివారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే కంగనా రనౌత్‌ కొద్దిరోజుల క్రితం ఓ ట్వీట్‌ చేసి తీవ్ర విమర్శలపాలైంది. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ వృద్ధురాలి గురించి తప్పుడు సమాచారంతో కూడిన ట్వీట్‌ చేసి కొద్దిసేపటికే దాన్ని డిలీట్‌ చేసింది. దీంతో నెటిజన్లతోపాటు పలువురు సెలబ్రిటీలు ఆమెపై మండిపడ్డారు. పంజాబీ సింగర్లు దుల్జిత్‌, మికా సింగ్‌లు కంగనను విమర్శించారు. మాతో పెట్టుకోవద్దు అని మికాసింగ్‌ ఆమెను హెచ్చరించాడు. 

ఇవీ చదవండి...

డిలీట్ చేసిన ట్వీట్‌ వివాదాల్లోకి లాగింది..!

‘కంగనా.. మాతో పెట్టుకోవద్దు’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని