‘ఢీ’ కంటే బెటర్ ఏముంది: మంచు విష్ణు
‘ఢీ’.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరిల నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్ కామెడీ టైమింగ్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను...
హైదరాబాద్: ‘ఢీ’.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్ కామెడీ టైమింగ్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే త్వరలో ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్ రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచువిష్ణు చేసిన ఓ ట్వీట్‌తో ‘ఢీ’ సీక్వెల్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
‘‘కొన్ని వేలమంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుడికి ఇది ఒక గేమ్‌ఛేంజర్. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది. ‘ఢీ’ కంటే బెటర్ ఏమి ఉంటుంది?’’ అని విష్ణు పేర్కొన్నారు. అంతేకాకుండా నవంబర్ 23న ఓ ఆసక్తికరమైన అప్డేట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు. దీంతో నెటిజన్లు ‘ఢీ’ సీక్వెల్ గురించే విష్ణు ప్రకటించనున్నారని చెప్పుకొంటున్నారు.
ప్రస్తుతం ‘మోసగాళ్లు’ చిత్రంలో మంచువిష్ణు నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్, సునీల్‌శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్‌కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్‌లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్‌లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జగన్‌పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు