చనిపొమ్మంటూ ఫోన్‌కాల్స్‌ వచ్చాయి

కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న తరుణంలో లండన్‌ నుంచి భారత్‌కు వచ్చి ప్రమాదవశాత్తు కొవిడ్‌-19 బారినపడి ప్రతిఒక్కర్నీ షాక్‌కు గురి చేసిన బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌. వృత్తిపరమైన పనులరీత్యా మార్చి నెలలో ముంబయికి చేరుకున్న కనికా...

Published : 13 Dec 2020 10:37 IST

కరోనాతో పోరాటం చేసి కోలుకున్న సెలబ్రిటీ కనికా కపూర్‌

ముంబయి: కరోనాతో పోరాటం చేసి కోలుకుని ప్రస్తుతం జీవితంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వైరస్‌ బారినపడినప్పుడు తాను, తన కుటుంబసభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు.

‘లండన్‌ నుంచి ముంబయికు చేరుకున్న సమయంలో స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎవరూ చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక రెండు పార్టీల్లో పాల్గొన్నాను. లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాకెంతో భయమేసింది. అంత భయంలోనూ నాకు పాజిటివ్‌ అనే విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టలేదు. నాతో పార్టీల్లో పాల్గొన్న 300 మందికి, నా స్టాఫ్‌కు టెస్టులు చేశారు. ఎవరికీ కరోనా రాలేదు. అలా నేను 16 రోజులపాటు ఒంటరిగా ఆస్పత్రిలో ఉన్నాను’

‘నాకు కరోనా వచ్చిన సమయంలో నా కుటుంబం, పిల్లలు ఎంతో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా నా పిల్లల్ని లండన్‌లో వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. వాళ్లు ప్రతిరోజూ ఫోన్‌ చేసి.. ‘అమ్మ ఎలా ఉన్నావు? మా దగ్గరకి ఎప్పుడు వస్తావు?’ అని అడిగేవాళ్లు. కొన్నిసార్లు నేను కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను. కొంతమంది నెటిజన్లు.. సోషల్‌మీడియా వేదికగా నా పిల్లలకు ఫోన్‌ చేసి తిట్టారు. అంతేకాకుండా చనిపోవాలని పిచ్చి సలహాలు కూడా ఇచ్చారు. మరోవైపు భారత్‌లో ఉన్న నా తల్లిదండ్రులకూ.. ఎన్నో ఫోన్‌ కాల్స్‌. నా కుటుంబమంతా ఎంతో ఒత్తిడికి గురయ్యింది. అలాంటి క్షణాల్లోనూ నా కుటుంబం నాకు తోడుగా నిలిచింది. అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని కనికా కపూర్‌ తెలిపారు.

ఇవీ చదవండి

కృతిసనన్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ దర్శకుడికి గుండెపోటు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని