రతన్‌టాటా బయోపిక్‌పై మాధవన్ క్లారిటీ
అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైనా రతన్‌టాటా ‘బయోపిక్’పై గత కొంతకాలంగా సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’తో భారీ సాధించిన డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వినిపించాయి.
చెన్నై: అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైనా రతన్‌టాటా ‘బయోపిక్’పై గత కొంతకాలంగా సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’తో భారీ సాధించిన డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వినిపించాయి. అందులో మాధవన్ ‘రతన్‌టాటా’గా కనిపించనున్నారని.. ఈ సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారని సోషల్ మీడియాలోనూ పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఈ వార్తలపై స్పందించాడీ సఖీ హీరో.
‘మాధవన్.. మీరు రతన్ టాటా బయోపిక్ సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్నారట. ఇది నిజమేనా.? ఒకవేళ ఈ వార్త నిజమైతే ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ఓ అభిమాని పోస్టు చేశాడు. దానికి ఓ పోస్టర్‌ను కూడా జత చేశాడు. అందులో మాధవన్ అచ్చం రతన్‌టాటాలా కనిపిస్తున్నాడు. అయితే.. ఈ పోస్టర్‌పై మాధవన్ స్పందించారు. ‘దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానుల కోరిక మాత్రమే. ఇంతవరకూ అలాంటి ప్రాజెక్టు గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు’ అని మాధవన్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా.. సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’తో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ సుధా కొంగర తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
అనుష్క ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన ‘నిశ్శబ్దం’లో మాధవన్ కీలకపాత్రలో నటించారు. అయితే.. అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. మాధవన్ నటించిన ‘మారా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 17న ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్