ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్‌

ప్రముఖ నటుడు సోనూసూద్‌ తన ఆస్తుల్లో కొన్నింటిని తాకట్టుకు పెట్టారట. ఆయన లాక్‌డౌన్‌ నుంచి నిస్సహాయుల్ని ఆదుకుంటూ పేదల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి.. వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించడం నుంచి పేదల విద్య....

Published : 09 Dec 2020 13:56 IST

ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్‌ తన ఆస్తుల్లో కొన్నింటిని తాకట్టు పెట్టారట. ఆయన లాక్‌డౌన్‌ సమయం నుంచి నిస్సహాయుల్ని ఆదుకుంటూ పేదల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి.. వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించడం నుంచి పేదల విద్య, వైద్య ఖర్చులు కూడా భరిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా తనవంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెటిజన్లు ఆయన్ను రియల్‌ హీరోగా కొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూ రూ.10 కోట్ల విరాళం పోగుచేయడానికి ముంబయిలోని జుహూలో గల తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట.

సెప్టెంబరు 15న అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబరు 24న రిజిస్ట్రేషన్‌ జరిగిందని సమాచారం. ‘ఎదుటివారి కోసం ఇలాంటి పని చేసిన వాళ్లను నేను ఇంత వరకు చూడలేదు’ అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్‌ హెడ్ రితేష్‌ మెహతా ఈ సందర్భంగా మీడియాతో చెబుతూ ఆశ్చర్యపోయారు. దీనిపై సోనూ సూద్‌ స్పందించాల్సి ఉంది.

ఇవీ చదవండి..
రైతులు.. ఆహారాన్ని అందించే సైనికులు
సాయికుమార్‌తో నేనెప్పుడూ అలా అనలేదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని