ఆత్మహత్యకు ముందురోజు సుశాంత్ ఏం చేశాడంటే..
బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌కు శునకాలంటే ఎంతో ఇష్టం ఉండేది..
పలు విషయాలు వెల్లడించిన ఫామ్‌హౌజ్ నిర్వాహకుడు
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌కు శునకాలంటే ఎంతో ఇష్టం ఉండేది. వీలు చిక్కినప్పుడల్లా తన పెంపుడు శునకాలతో కాలక్షేపం చేస్తుండేవాడు. తనువు చాలించాలనుకునే సమయంలోనూ వాటి బాగోగుల గురించి ఆలోచించాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందురోజు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు శునకాల పోషణకు డబ్బు బదిలీ చేశాడు. లోనావాలాలోని ఫామ్‌హౌజ్‌లో ఉన్న పెంపుడు కుక్కలు అమర్, అక్బర్, ఆంటొనీలకు సపర్యలు చేస్తున్న సంరక్షకుడు రాయీస్‌కు నగదు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని రాయీస్ స్వయంగా వెల్లడించాడు. ‘జూన్ 14న సుశాంత్ సర్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి నమ్మలేకపోయాను. పెంపుడు కుక్కలకు అవసరమయ్యే డబ్బును అంతకు ముందురోజే నా ఖాతాలో జమచేశారు’ అని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఫామ్‌హౌజ్‌కి శాశ్వతంగా వచ్చేసి సేంద్రియ వ్యవసాయం చేసే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఇలా జరిగిందని రాయీస్ తెలిపాడు.
‘సుశాంత్ సర్ తరచూ ఫామ్‌హౌస్‌ను సందర్శించేవారు. రియా, ఆమె తండ్రి పుట్టినరోజు లాంటి ప్రత్యేక రోజులను ఇక్కడే నిర్వహించేవారు. జనవరిలో సర్ తన పుట్టినరోజును జరుపుకునేందుకు రియాతో కలిసి వచ్చారు. వారి వెంట మేనేజర్ శామ్యూల్ మిరాండా, శ్రుతి మోదీతోపాటు పలువురు మిత్రులు కూడా వచ్చారు’ అని పేర్కొన్నాడు. ‘గతేడాది అక్టోబర్‌లో ఐరోపా పర్యటన అనంతరం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. రెండు నెలలుగా ఇక్కడికి రాలేదు. 2018లోనే ఫామ్‌హౌజ్‌ని అద్దెకు తీసుకున్నారు. ఏడాది తర్వాత ఒప్పందం పునరుద్ధరించే సమయానికి దానిని కొనాలనుకున్నారు. అనంతరం శాశ్వతంగా ఇక్కడికే వచ్చేసి సేంద్రియ వ్యవసాయం చేయాలని భావించారు. అందుకు తగినట్లు పలు ఏర్పాట్లు సైతం చేయించుకున్నారు’ అని రాయీస్ వివరించాడు. ఈ ఏడాది మే నెలలోనే అద్దె ఒప్పందం ముగిసినప్పటికీ జూన్, జులై నెలలకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో ఫామ్‌హౌజ్‌ని చివరిసారి సందర్శించినప్పుడు రెండు, మూడు నెలలపాటు అక్కడే ఉండేందుకు పలు ఏర్పాట్లు చేసుకున్నాడని, కానీ అది జరగలేదని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు. -
నాలుగు క్యారవాన్లు ఇస్తే కానీ సెట్లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ తారలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. -
వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా
తన పీఆర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్‌గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు