‘లవ్‌స్టోరి’కి అదే స్ఫూర్తి

‘‘ఈ సినిమాని చూసి ఒక ఆడపిల్ల తాను పడుతున్న ఇబ్బందుల్ని బయటికి చెప్పుకోగలిగే ధైర్యం తెచ్చుకుంటే...వివక్షకు గురైన ఓ ఊరి అబ్బాయి ఇది నా కథ అని చెప్పుకుంటే..

Updated : 25 Sep 2021 07:04 IST

‘‘ఈ సినిమాని చూసి ఒక ఆడపిల్ల తాను పడుతున్న ఇబ్బందుల్ని బయటికి చెప్పుకోగలిగే ధైర్యం తెచ్చుకుంటే...వివక్షకు గురైన ఓ ఊరి అబ్బాయి ఇది నా కథ అని చెప్పుకుంటే మాకు ఇంకా పెద్ద విజయం సాధించినట్టుగా భావిస్తాం’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి చక్కటి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సంబరాల్ని జరిపింది. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘నిర్భయ ఘటన తర్వాత సమాజానికి మంచిని చెప్పే సినిమా చేయాలనుకున్నా. ఆ తర్వాత పాఠశాలలు, కళాశాలలకి వెళ్లి అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించాం. అక్కడే ఈ కథకి స్ఫూర్తి దొరికింద’’న్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నారాయణదాస్‌ నారంగ్‌, రామ్‌మోహన్‌రావు, సునీల్‌ నారంగ్‌ ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు