Sherni: పులిని పట్టుకుందా? లేదా?

అదో అందమైన అటవీ ప్రాంతం. దానికి దగ్గర్లో ఓ చిన్న గ్రామం. గ్రామస్తులపై పులి దాడి చేస్తోంది.

Updated : 03 Jun 2021 10:00 IST

దో అందమైన అటవీ ప్రాంతం. దానికి దగ్గర్లో ఓ చిన్న గ్రామం. గ్రామస్తులపై పులి దాడి చేస్తోంది. దాన్ని పట్టుకోవడం ఎవరివల్లా కాదు. పులిని పట్టుకోవడానికి అడవికి వస్తుంది ఓ మహిళా అటవీ అధికారి. వచ్చాకా ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎలాంటి కష్టనష్టాలకోర్చి ఆమె గ్రామస్తుల సమస్యని తీర్చింది? ఇవన్నీ ఆసక్తికరం అంటోంది ‘షేర్నీ’ చిత్రబృందం. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 18న ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుంది. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా విద్యా నటన, ఆమె సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు