చైతన్య కోసం నదిలోకి దూకిన అభిమాని

తమకిష్టమైన హీరోని చూసేందుకు కొంతమంది అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే మరి కొంతమంది అభిమానులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా కథానాయకుడు నాగచైతన్యని చూసేందుకు...

Published : 04 Mar 2021 21:11 IST

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: తమకిష్టమైన హీరోని చూసేందుకు కొంతమంది అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే మరి కొంతమంది అభిమానులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా కథానాయకుడు నాగచైతన్యని చూసేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించి నదిలోకి దూకేశాడు. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా, ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్‌ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోంది. అభిమాన నటుడు తమ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న ఎంతోమంది స్థానికులు లొకేషన్‌ వద్దకు చేరుకున్నారు. షూట్‌లో భాగంగా పడవలో ప్రయాణిస్తున్న చైతన్యను చూసేందుకు పలువురు అభిమానులు ఆసక్తి కనబరిచారు. దగ్గరలో ఉన్న వంతెనపై నిల్చొని ‘చైతన్య, చైతన్య’ అని పిలవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అత్యుత్సాహం కనబరిస్తూ.. నదిలోకి దూకేశాడు. అంతేకాకుండా చైతన్య పడవ వెనుకనే ఈత కొట్టాడు. అభిమాని చర్యతో షాక్‌కు గురైన చైతన్య.. సదరు అభిమానిని కలిసి అతనితో మాట్లాడి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సున్నితంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని