Aadhi: వేడుకగా ఆది పినిశెట్టి వివాహం

‘గుండెల్లో గోదారి’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు ఆది పినిశెట్టి వివాహం బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. కోలీవుడ్‌ నటి నిక్కీ గల్రానీని ఆయన పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట...

Updated : 19 May 2022 12:57 IST

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్‌ హీరోల సందడి

చెన్నై: ‘గుండెల్లో గోదారి’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు ఆది పినిశెట్టి వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. కోలీవుడ్‌ నటి నిక్కీ గల్రానీని ఆయన పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలు వీరి పెళ్లికి వేదికైంది. అతి తక్కువమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్‌ హీరోలు నాని, సందీప్‌ కిషన్‌ సందడి చేశారు. హల్దీ, సంగీత్‌లలో వీరు డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన వారందరి కోసం ఈ జంట త్వరలోనే వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆది-నిక్కీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ (Yagavarayinum Naa Kaakka)లో ఈ జంట కలిసి నటించింది. ఆ సినిమాతో స్నేహితులుగా మారిన వీరిద్దరూ ‘మరగాధ నాణ్యం’తో ప్రేమికులు అయ్యారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో ప్రస్తుతం ఆది సినిమాలు చేస్తున్నారు. రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ది వారియర్‌’లో ఆది ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని