BLACK: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో ఆది.. ‘బ్లాక్‌’ ట్రైలర్‌ చూశారా?

‘ఒక్కోసారి లైఫ్‌ మనకు కావాల్సింది ఇవ్వదు.. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది’ అంటున్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమా

Updated : 15 Aug 2022 16:04 IST

హైదరాబాద్‌: ‘ఒక్కోసారి లైఫ్‌ మనకు కావాల్సింది ఇవ్వదు.. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది’ అంటున్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌. జి.బి.కృష్ణ దర్శకత్వంలో ఆది నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘బ్లాక్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘‘విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. ఆది నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. దర్శకుడు ఓ మంచి కథతో చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చిత్ర బృందం తెలిపింది. దర్శనబానిక్‌, కౌశల్‌ మందా, ఆమని, పృథ్వీరాజ్‌, సూర్య, సత్యం రాజేష్‌, తాగుబోతు రమేష్‌, ఆనంద్‌ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం: సురేష్‌ బొబ్బిలి అందిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని