అభిషేక్‌ ‘బిగ్‌బుల్’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘బిగ్‌బుల్‌’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో స్టాక్‌మార్కెట్‌లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా సినిమా నిర్మించిననట్టు బాలీవుడ్‌ టాక్‌. ఏప్రిల్‌ 8న ఈ

Published : 25 Mar 2021 16:47 IST

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘బిగ్‌బుల్‌’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా సినిమా నిర్మించిననట్టు బాలీవుడ్‌ టాక్‌. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఆ చిత్రంలోని ‘ఇష్క్‌ నమాజా’అంటూ సాగుతున్న ఫీల్‌గుడ్‌ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. కున్వార్‌ జునేజా సాహిత్యమందించగా, అంకిత్‌ తివారి ఆలపించారు. గౌరవ్‌దాస్‌ గుప్తా స్వరాలు సమకూర్చారు. నిఖితా దత్తా అభిషేక్‌ భార్యగా నటిస్తుండగా, ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ పాత్రలో ఇలియానా నటిస్తోంది. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆనంద్‌ పండిత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోకి గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని