Cannes 2022: క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌ వచ్చేసింది.. అందరి చూపు ఆమె వైపే..!

సినీ, ఫ్యాషన్‌ ప్రియులందరూ ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. ‘క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌’గా పిలవబడే ఐశ్వర్యారాయ్‌ కేన్స్‌లోని ఎర్రతివాచీపై హంసనడకలతో అదరహో అనిపించింది. అంతర్జాతీయ సినీ రంగంలో.....

Updated : 19 May 2022 11:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ, ఫ్యాషన్‌ ప్రియులందరూ ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. ‘క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌’గా పిలుచుకొనే ఐశ్వర్యారాయ్‌ కేన్స్‌లోని ఎర్రతివాచీపై హంసనడకలతో అదరహో అనిపించింది. అంతర్జాతీయ సినీ రంగంలో ప్రముఖంగా చెప్పుకునే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మే 17వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో తొలిరోజు తమన్నా, దీపిక, ఊర్వశి రౌతెల్లా రెడ్‌ కార్పెట్‌పై కనిపించగా.. రెండోరోజు ఐశ్వర్య, పూజాహెగ్డే సందడి చేశారు. నలుపు, పూలగౌనులో చాలా సింపుల్‌గా ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌పైకి అడుగుపెట్టగానే అందరి చూపు ఆమె పైనే పడింది. దీనికి సంబంధించిన ఫొటోలు విడుదల కాగా.. వాటిని చూసిన ఫ్యాషన్‌ ప్రియులు.. ‘కేన్స్‌కి ఐశ్వర్య దేవత’, ‘కేన్స్‌ రాణి’, ‘ఐశ్వర్య ఈజ్‌ సో బ్యూటీఫుల్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరోవైపు, నటి పూజాహెగ్డే తొలిసారి ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడి చేశారు. క్రీమ్‌, బంగారు వర్ణంలో ఉన్న గౌనులో హొయలొలికించారు. లవ్‌ యూ ఆల్‌ అంటూ హార్ట్‌ సింబల్‌ చూపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని