Sampath Raj: అందుకే త్రివిక్రమ్‌ని బెదిరించాల్సి వచ్చింది..కమెడియన్‌ సునీల్‌ సాయం చేశాడు

అవకాశమిస్తే ఐటమ్‌సాంగ్‌లోనైనా డ్యాన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు నటుడు సంపత్‌ రాజ్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి సంపత్‌ రాజ్‌ విచ్చేసి అనేక విషయాలను పంచుకున్నారు.

Updated : 26 Jan 2022 10:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవకాశమిస్తే ఐటమ్‌ సాంగ్‌లోనైనా డ్యాన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు నటుడు సంపత్‌ రాజ్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి సంపత్‌ రాజ్‌ విచ్చేసి అనేక విషయాలను పంచుకున్నారు. ‘‘సినిమాల్లో నటిస్తానని అమ్మకి చెబితే.. ‘చదువు, పనిపాట లేనివాడు, జీవితంలో ఏ ఆశయం లేని వాళ్లే సినిమావైపు వెళ్తారు’ అని అన్నారు. దానికి నాన్న ఒకటే బదులిచ్చారు. అమ్మకి భయపడి ఇలానే ఉంటే సినిమాల్లోకి వెళ్లలేవు. ఇంటి నుంచి పారిపో’’ అంటూ సలహా ఇచ్చారని సంపత్‌ చెప్పుకొచ్చారు.

ఇక తన తల్లిదండ్రుల పెళ్లిచూపుల గురించి సంపత్‌ చెబుతూ.. ‘‘పోలీస్‌ యూనిఫామ్‌లో అమ్మని చూడటానికి నాన్న వెళ్లారు. ఆ సమయంలో అమ్మ ఇల్లు కడుగుతుంటే.. ఆమెను పని మనిషి అనుకున్నారట. అమ్మేమో.. లోపలికి పరిగెత్తి... ‘ఇంటికి పోలీస్‌ వచ్చారు’ అని చెప్పారట’’  అని సంపత్‌ చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్‌ తదుపరి సినిమాలో అవకాశమివ్వకపోతే ‘లొకేషన్‌కి వచ్చి కెమెరా ఎత్తుకెళ్లిపోతా’నని బెదిరించానని అన్నారు. త్రివిక్రమ్‌ ఆఫీస్‌ ఎక్కడ ఉంటుందనేది ‘ఎఫ్‌3’ షూటింగ్‌లో సునీల్‌ చెప్పారన్న రహస్యాన్ని బయటపెట్టారు. ‘మిర్చి’ రిలీజ్‌ అయ్యాక శంషాబాద్‌లో అభిమానుల తాకిడికి చూసి ఆశ్చర్యపోయానన్నారు. నటి శరణ్య తాను కేవలం కో-స్టార్స్‌ మాత్రమేనని నా భార్య కాదని బయట వచ్చే  వదంతులకు చెక్‌ పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని