పిల్లడు అదుర్స్‌.. సాంగ్‌ అదిరింది

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేలా ఉంది ‘అల్లుడు అదుర్స్‌’టీమ్‌. తాజాగా శనివారం ఆ చిత్రంలోని ‘పిల్లడు అదుర్స్‌’ అనే లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. సాయి శ్రీనివాస్‌, నభానటేష్‌ ఆడిపాడుతున్న ఈ సెట్‌సాంగ్‌ మంచి బీట్‌తో

Updated : 11 Jan 2021 19:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ‘అల్లుడు అదుర్స్‌’టీమ్‌ సిద్ధమైంది. తాజాగా శనివారం ఆ చిత్రంలోని ‘పిల్లడు అదుర్స్‌’ అనే పాటను విడుదల చేసింది. సాయి శ్రీనివాస్‌, నభానటేష్‌ ఆడిపాడుతున్న ఈ సెట్‌సాంగ్‌ మంచి బీట్‌తో అదుర్స్ అనిపిస్తోంది. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేస్తున్న స్టెప్స్‌ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. దేవిప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, జస్ప్రిత్‌జాజ్‌, వైష్ణవి ఆలపించారు. సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌‌ నిర్మిస్తోంది. ఈ హుషారైన గీతాన్ని మీరూ చూసేయండీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని