Anthahpuram Review: రివ్యూ: అంతఃపురం
Anthahpuram Review: ఆర్య, రాశీఖన్నా, ఆండ్రియా, సుందర్ సి నటించిన ‘అంతఃపురం’ ఎలా ఉందంటే?
చిత్రం: అంతఃపురం; నటీనటులు: సుందర్ సి, ఆర్య, రాశీఖన్నా, ఆండ్రియా, సాక్షి అగర్వాల్, వివేక్ యోగిబాబు, మనోబాల; సంగీతం: సి.సత్య; సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్; ఎడిటింగ్: ఫెన్నీ ఓలివర్; నిర్మాత: ఖుష్బూ; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సి; విడుదల: జీ5
తెలుగు, తమిళ భాషల్లో హారర్ కామెడీ చిత్రాలకు కొదవలేదు. ఈ జానర్లో పలు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాల్ని అందుకున్నాయి. ఇలాంటి చిత్రాలు తీయడంలో తమిళ దర్శకుడు సుందర్‌ది ప్రత్యేకమైన శైలిలో గతంలో ఆయన ‘అరణ్మణై ’, ‘అరణ్మణై 2’ చిత్రాలు తీసి విజయం సాధించారు. అవే తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘అరణ్మణై3’. ఇటీవల తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ‘అంతఃపురం’ కథేంటి? అందులో ఏం జరిగింది?
కథేంటంటే: జ్యోతి(రాశీఖన్నా) జమీందారు రాజశేఖర్ (సంపత్‌రాజ్) కుమార్తె. చిన్నతనంలోనే తల్లి ఈశ్వరి(ఆండ్రియా) చనిపోవడంతో ఒంటరిగా పెరుగుతుంది. అంతఃపురంలాంటి ఇంట్లో ఆమెకు దెయ్యాలు కనపడుతూ ఉంటాయి. అదే విషయాన్ని తండ్రికి చెబితే, చదువుకునేందుకు ఇష్టంలేక అబద్ధాలు చెబుతోందని ఆమెను హాస్టల్‌కు పంపుతాడు. 22ఏళ్ల తర్వాత ఒకరోజు జమీందారు కారు డ్రైవర్ (విన్సెంట్ అశోకన్) అనుమానాస్పద స్థితిలో ఈతకొలనులో పడి చనిపోతాడు. అతడిని ఆఖరి చూపు చూసేందుకు తిరిగి వస్తుంది జ్యోతి. ఈసారి జ్యోతిపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ఇంతకీ జ్యోతిని హత్య చేసేందుకు ప్రయత్నించింది ఎవరు? ఆమె తల్లి ఈశ్వరి ఎలా చనిపోయింది? ఈ సమస్యను జ్యోతి బంధువు రవి(సుందర్ సి) ఎలా పరిష్కరించాడు? ఇందులో జ్యోతిని ప్రేమించిన రాఘవ(ఆర్య) పాత్ర ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ‘అరణ్మణై’ సిరీస్‌లో సుందర్ సి. రూపొందించిన చిత్రాలన్నీ హారర్ రివేంజ్ డ్రామాలే. ఇప్పుడు వచ్చిన ‘అంతఃపురం’ కూడా ఆ కోవలోదే. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఇలాంటి హారర్ రివేంజ్ డ్రామాలు ఎన్నో అలరించాయి. ఈ తరహా కథలన్నింటికీ ఇతివృత్తం ఒకటే అయినా, వాటిని ఎంత ఉత్కంఠగా చూపించామన్న దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు సుందర్.సి పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. రొటీన్ రివేంజ్ డ్రామాను తీసుకుని నాలుగు దెయ్యం షాట్లు.. నాలుగు కామెడీ సీన్లు, మరో నాలుగు విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను వండి వార్చారు. జమీందారు కారు డ్రైవర్ చనిపోవటం, ‘అంతఃపురం’లో ఉన్న దెయ్యం జ్యోతిపై హత్యాయత్నం చేయడంతో.. అసలు ఆమెను దెయ్యం ఎందుకు చంపాలనుకుంటోందన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో తన కుమార్తెను చూసి వెళ్లేందుకు వచ్చిన జమీందారు సోదరి భర్త రవికి ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం జ్యోతి ద్వారా తెలుస్తుంది. అప్పటి వరకూ కథ అంతా సోసోగా నడిపించాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే వివేక్, యోగిబాబు, మనోబాలల కామెడీ ట్రాక్ కూడా పెద్దగా నవ్వించదు. హారర్ సినిమాల్లో భయపడుతూ ఉండే సగటు పాత్రలే వాళ్లు పోషించారు. ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు? దాని కథ ఏంటో తెలుసుకునేందుకు రవి రంగంలోకి దిగిన తర్వాతే అసలు కథలు మొదలవుతుంది. అప్పటి నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. రవి తెలుసుకునే ఒక్కో విషయం ఆసక్తిగా ఉంటుంది. ఆ ట్విస్ట్‌లు కూడా గతంలో వచ్చిన ఒక ట్రెండు హారర్ సినిమాలో చూసినట్లే కనిపిస్తాయి. అయితే, దెయ్యం జ్యోతిని ఎందుకు చంపాలనుకున్నదే ఇందులో అసలైన ట్విస్ట్. హారర్ సినిమాల్లో ఉన్నట్లే పతాక సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి చివరి వరకూ కనిపించే విజువల్ ఎఫెక్ట్లు మాత్రం చాలా బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే: ‘అంతఃపురం’లో నటించిన ఆండ్రియా, ఆర్య, రాశీఖన్నా, సుందర్ సి, సంపత్ రాజ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఆర్యతో సహా ఏ పాత్రకూ పెద్దగా స్కోప్‌లేదు. యోగిబాబు, వివేక్, మనోబాల కామెడీ ట్రాక్ పర్వాలేదు. హారర్ సినిమాల్లో ఇలాంటి కాంబినేషన్ గతంలో మనం చూసిందే. ఇక తాంత్రిక విద్యలు, సడెన్‌గా దెయ్యాలు కనిపించటం, కుర్చీలు-సోఫాలు గాల్లోకి లేవటం, దెయ్యాన్ని బంధించేందుకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కామన్. సాంకేతికంగా ఈ సినిమా చక్కగా ఉంది. సి.సత్య నేపథ్య సంగీతం హారర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అయితే, గుర్తుండిపోయే పాట ఒక్కటీ లేదు. ఫెన్నీ ఓలివర్ ఎడిటింగ్ ఓకే. కామెడీ ట్రాక్‌ను ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది యూకే సెంథిల్ కెమెరా. ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా హారర్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్ సీన్స్ బాగున్నాయి. దర్శకుడు సుందర్ సి. ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. అదే పాత రివేంజ్ డ్రామా. ఇందులో మరో కొత్త దెయ్యం ప్రతీకారాన్ని చూపించారంతే. అయితే, కథనాన్ని ఉత్కంఠగా తీర్చిదిద్దడంలో తన మార్కు కనిపించింది. మంచిపై చెడు ఎన్నటికీ విజయం సాధించదని తెలిసినా, ఆ విజయం ఎలా లభించిందన్నది పాయింటే సినిమాను చివరి వరకూ చూసేలా చేస్తుంది. హారర్ మూవీ కాబట్టి, లాజిక్‌లు పూర్తిగా వదిలేయాల్సిందే. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులు కూడా కాలక్షేపం కోసం ‘అంతఃపురం’ చూడొచ్చు. ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
బలాలు
+ ద్వితీయార్ధం
+ విజువల్ ఎఫెక్ట్స్
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
- రొటీన్ రివేంజ్ స్టోరీ
- నిడివి
చివరిగా: కాలక్షేపానికే ‘అంతఃపురం’!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..?