AR Rahman: లవ్‌స్టోరి టీమ్‌కి ఏఆర్‌ రెహమాన్‌ విషెస్‌

‘లవ్‌స్టోరి’ చిత్రబృందానికి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ సినిమాతో ఆయన శిష్యుడు పవన్‌ సీహెచ్‌ సంగీత దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘ నీలో చాలా ప్రతిభ ఉంది పవన్‌. నువ్వు సక్సెస్‌తో ప్రజాభిమానం పొందాలని ఆశిస్తున్నా. నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల అందరికీ గుడ్‌లక్‌’’ అంటూ వీడియోని పంచుకున్నారు.

Updated : 07 Dec 2022 20:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో వెండితెరపై రాబోతున్న ‘లవ్‌స్టోరి’ చిత్రబృందానికి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ సినిమాతో ఆయన శిష్యుడు పవన్‌ సీహెచ్‌ సంగీత దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘ నీలో చాలా ప్రతిభ ఉంది పవన్‌. నువ్వు సక్సెస్‌తో ప్రజాభిమానం పొందాలని ఆశిస్తున్నా. నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల అందరికీ గుడ్‌లక్‌’’ అంటూ వీడియోని పంచుకున్నారు. లవ్‌స్టోరికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విజయ్‌.సి.కుమార్‌ తనయుడే పవన్‌ సీహెచ్‌. ఒకే సినిమాకి తండ్రికొడుకులు కీలక బాధ్యతలు వహించడం అరుదుగా జరిగే విషయమంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. మంగ్లీ పాడిన జానపద గీతం ‘సారంగదరియ’ 324 మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకోగా..‘నీ చిత్రం చూసి’ పాట 31మిలియన్లు,  ‘ఏయ్‌పిల్లా’  23మిలియన్లతో ముందుకు కొనసాగుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని