Auto Rajini: యాక్షన్‌ రజనీ

జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజనీ’.  శ్రీనివాస్‌ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఎంపీ నందిగాం సురేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర బృందం ఇటీవల ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఈ

Updated : 21 May 2022 08:07 IST

జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజనీ’.  శ్రీనివాస్‌ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఎంపీ నందిగాం సురేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర బృందం ఇటీవల ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఆయనకు చూపించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవలే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఓ భారీ షెడ్యూల్‌ చిత్రీకరించాం. అలాగే ప్రేమ్‌ రక్షిత్‌ ఆధ్వర్యంలో 150మంది డ్యాన్సర్లతో ఓ పాట తెరకెక్కించాం. జూన్‌ 10న విజయవాడలోనే మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. జులై 10 నుంచి కృష్ణపట్నం పోర్టులో క్లైమాక్స్‌ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ బాబు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని