విక్రమ్‌‘కోబ్రా’టీజర్‌ చూశారా!

విలక్షణ నటుడు చియాన్‌ విక్రమ్‌ ‘కోబ్రా’అంటూ త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. తాజాగా శనివారం ఆ చిత్రం టీజర్‌ విడుదలయ్యింది.  శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌ చూస్తుంటే విక్రమ్‌ తనదైన శైలిలో విభిన్న గెటప్స్‌లో

Published : 09 Jan 2021 11:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలక్షణ నటుడు చియాన్‌ విక్రమ్‌ ‘కోబ్రా’గా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. తాజాగా శనివారం ఆ సినిమా టీజర్‌ విడుదలయ్యింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌ చూస్తుంటే విక్రమ్‌ తనదైన శైలిలో విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ‘కోబ్రా’లో మరో విశేషం ఏంటంటే మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేపథ్యసంగీతం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏఆర్‌ రెహమాన్‌ మార్కును తెలియజేస్తోంది. అజయ్‌  జ్ఞానముత్తు దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెవెన్‌స్క్రీన్‌ స్టూడియో నిర్మిస్తోంది. మరి లేటేందుకు ఆ టీజర్‌ మీరు చూసేయండీ!

ఇవీ చదవండి!

ధనుష్‌ కొత్త చిత్రం ప్రారంభం

కేలరీలు కరిగించే పనిలో కియారా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని