sekhar movie: ‘శేఖర్‌’ మూవీ ప్రదర్శనలు నిలిపివేత.. రాజశేఖర్‌ ఏమన్నారంటే!

రాజశేఖర్‌(Rajasekhar) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు.

Published : 22 May 2022 16:05 IST

హైదరాబాద్‌: రాజశేఖర్‌(Rajasekhar) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది.  ఈ క్రమంలో ‘శేఖర్‌’ చిత్రానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  జీవితా రాజశేఖర్‌ డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్‌’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోపు రూ.65లక్షలు డిపాజిట్‌ చేయాలని కోర్టు తెలిపింది. నగదు డిపాజిట్‌ చేయకపోతే శేఖర్‌ మూవీ అన్ని హక్కులు అటాచ్‌ చేయాలని ఆదేశించింది. థియేటర్లు, డిజిటల్‌, శాటిలైట్‌, ఓటీటీ యూట్యూబ్‌లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని కోర్టు పేర్కొంది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నటుడు నటుడు రాజశేఖర్‌(Rajasekhar) స్పందించారు. కొందరు కుట్ర చేసిన  తమ సినిమా ప్రదర్శన నిలిపివేశారని అన్నారు. శేఖర్‌ చిత్రాన్ని పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు