Deepika Padukone: నన్ను ఇలాంటి పాత్రలో చూసుండరు
‘‘నన్ను ఇలాంటి ఓ పాత్రలో ఇప్పటివరకూ చూసుండరు’’అంటోంది దీపికా పదుకొణె. ఆమె సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ధైర్య కర్వలతో కలిసి నటించిన చిత్రం ‘గెహ్రాహియా’. ఇందులో అలిషా అనే పాత్రలో దీపిక నటించింది. ఈ సినిమా వచ్చే
‘‘నన్ను ఇలాంటి ఓ పాత్రలో ఇప్పటివరకూ చూసుండరు’’అంటోంది దీపికా పదుకొణె. ఆమె సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ధైర్య కర్వలతో కలిసి నటించిన చిత్రం ‘గెహ్రాహియా’. ఇందులో అలిషా అనే పాత్రలో దీపిక నటించింది. ఈ సినిమా వచ్చే నెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. షకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈసినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. రెండు జంటల కథ, ముఖ్యంగా అలీషా, జైన్ మధ్య కథ సాగుతుంది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాల చుట్టూ దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. దీపిక, సిద్ధాంత్ మధ్య వచ్చే సన్నివేశాల్లో శృంగారం మోతాదు ఎక్కువగానే ఉన్నట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. ధర్మప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి. దీపిక మాట్లాడుతూ ‘‘మన దేశంలో ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. అందరికీ చెప్పాల్సిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించారు దర్శకుడు షకున్. ఈ తరహా కథ రావడం కచ్చితంగా ఇదే తొలిసారి’’అని చెప్పింది. పెద్దలు మాత్రమే చూసే కంటెంట్ ఉందని, సెన్సార్ నుంచి అభ్యంతరాలు వస్తాయనే ఉద్దేశంతో ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్‌లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!