Dhee13 promo: ఇంట్రెస్టింగ్‌... ఈ వారం ఇద్దరు ‘కింగ్స్‌’ ఎలిమినేట్‌!

‘అదుర్స్‌’లోని ‘చంద్రకళ’ పాటకి శ్రవణ్‌ అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

Updated : 01 Oct 2021 17:24 IST

హైదరాబాద్‌: ‘అదుర్స్‌’లోని ‘చంద్రకళ’ పాటకి శ్రవణ్‌ అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ‘ఎన్టీఆర్‌కి ఏమాత్రం తగ్గలేదు’ అని గణేశ్‌ మాస్టర్‌ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ‘వాన వాన వల్లప్ప’ పాటకు అందమైన స్టెప్పులతో పల్లెటూరి పడుచులాగా క్వీన్స్‌ కంటెస్టెంట్‌ చేసిన డ్యాన్స్‌కి పూర్ణ, ప్రియమణి ఫిదా అయ్యారు. ఆమె పలికించిన హావభావాలు నచ్చి ‘వన్‌ ఉమెన్‌ షో’ అని ప్రియమణి కితాబిచ్చింది. ప్రియమణి, గణేశ్‌ మాస్టర్‌, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డ్యాన్స్‌ షో ‘ఢీ-13’. ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ కాన్సెప్ట్‌తో ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రదీప్‌ వ్యాఖ్యాత. కింగ్స్‌ టీమ్‌ మెంటార్స్‌గా సుధీర్‌-ఆది, క్వీన్స్ టీమ్‌ మెంటర్స్‌గా రష్మి-దీపికా వ్యవహరిస్తున్నారు. వచ్చే బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

ఇందులో ఇరు జట్లకు చెందిన కంటెస్టెంట్స్‌ తమ డ్యాన్స్‌తో న్యాయనిర్ణేతల్ని ఫిదా చేశారు. ఇక సుధీర్‌, రష్మిల ప్రేమాయణంతో పాటు హైపర్‌ ఆది, దీపికలు చేసిన సందడి నవ్వులు పూయిస్తోంది. వీరికి ఫైమా పంచులు కూడా తోడై ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఈ వారం కింగ్స్‌ టీమ్‌లో రెండు ఎలిమినేషన్లుంటాయని ప్రియమణి చెప్పడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు? సుధీర్‌, రష్మిల ప్రేమకథ ఏమైంది? ఫైమా చేసిన సందడేంటి? లాంటి ఎన్నో ఆసక్తికర విశేషాలు చూడాలంటే అక్టోబర్‌ 8 దాకా ఆగాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని