ఆసుపత్రిలో డాక్టర్ల ‘సీటీమార్‌’ స్టెప్పులు

కరోనా సెకండ్‌ వేవ్‌లో వైద్యులకు కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. రోజంతా పీపీఈ కిట్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఓ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం దొరికిన కాస్త సమయాన్ని........

Published : 17 May 2021 00:01 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో వైద్యులకు కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. రోజంతా పీపీఈ కిట్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఓ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం దొరికిన కాస్త సమయాన్ని వినూత్నంగా ఆస్వాదించారు. సల్మాన్‌ఖాన్‌, దిశాపటాని జంటగా నటించిన ‘రాధే’ చిత్రంలోని ‘సీటీమార్‌’ పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు. అంతేకాదు ఓ వైద్యుడు సంగీత విద్వాంసుడిగా మారి మాండొలిన్ వాయించాడు. మరికొంత మంది అందుకు తగ్గట్లుగా డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను దిశాపటాని ఫ్యాన్స్‌ క్లబ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వైద్యులే మన రియల్‌ హీరోస్‌’ అంటూ పొగిడేస్తున్నారు. వారిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని