Devisri Prasad: నవ్వించాలని కంకణం కట్టుకొన్నాం
‘‘జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించేవారో.. అలాంటి ఆరోగ్య కరమైన హాస్యం ‘ఎఫ్3’లో ఉంద’’న్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే ‘ఎఫ్3’.విజయవంతమైన సినిమా ‘ఎఫ్2’కుసీక్వెల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా మే 27న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘‘జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించేవారో.. అలాంటి ఆరోగ్య కరమైన హాస్యం ‘ఎఫ్3’లో ఉంద’’న్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే ‘ఎఫ్3’.విజయవంతమైన సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా మే 27న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘‘ఎఫ్2’కు మించిన వినోదం ‘ఎఫ్3’లో ఉంటుంది. దీన్ని అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా రాశారు, తీశారు. ఆర్ఆర్ చేస్తూ.. నేను పడిపడి నవ్వుకున్నాను. ప్రేక్షకుల్ని నవ్వించాలని కంకణం కట్టుకొని సినిమా తీసినట్లుగా అనిపించింది. దీంట్లో వినోదంతో పాటు చక్కటి సందేశమూ ఉంది. దాన్ని అనిల్ చాలా గొప్పగా చెప్పారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇందులో చాలా అద్భుతంగా చేశారు. తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ.. ఇలా అందరూ హిలేరియస్‌గా చేశారు’’.
* ‘‘అనిల్ రావిపూడితో పనిచేస్తే ఒత్తిడి ఉండదు. ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడే సినిమా చూసినట్లు ఉంటుంది. ‘ఎఫ్2’లో ఎక్కువ సిట్యుయేషనల్ సాంగ్స్ ఉంటాయి. ఇందులో జనరల్‌గా కనెక్ట్ అయ్యే పాటలూ చేశాం. ‘లబ్ డబ్ డబ్బు’, ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా’ పాటలు కథలో భాగమవుతూనే అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇవి ప్రేక్షకులకీ కొత్త అనుభూతిని పంచిచ్చాయి. రీరికార్డింగ్ అంతా చూసి.. ‘అద్భుతంగా చేశారు. మీకు వంద హగ్గులు, వంద ముద్దులు’ అన్నారు అనిల్ రావిపూడి. ఆ మాట నాకు చాలా ఆనందాన్నిచ్చింది’’.
* ‘‘నేనెప్పుడూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ చేస్తాను. ఒక ట్యూన్ కంపోజ్ చేసి, దీనికి నేను డ్యాన్స్ చేస్తానా? లేదా? అని చూసుకుంటాను. ట్యూన్ కంపోజ్ చేసినప్పుడే నాకు ఒక ఊపు వచ్చిందంటే అందరికీ ఆ జోష్ వస్తుందని నమ్ముతా. బహూశా అదే నా సీక్రెట్. ఇండస్ట్రీలో సంగీత దర్శకుల మధ్య పోటీ ఏమీ ఉండదు. మంచి పాటలు వచ్చినప్పుడు దాన్ని చూసి ప్రేరణ పొందుతాం. అలాంటి పాట మనమూ చేస్తే బావుంటుందనిపిస్తుంది. అంతే కానీ, మా మధ్య కాంపిటేషన్ ఏమీ ఉండదు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!