వండల్‌ఫుల్‌ అబ్బాయి నాగ చైతన్య: ఫరా

యువ కథానాయకుడు నాగ చైతన్యతో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరించారు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, నటి, దర్శకురాలు ఫరా ఖాన్‌. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు తెలియజేశారామె.

Published : 17 Mar 2021 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నాగ చైతన్యతో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరించారు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, నటి, దర్శకురాలు ఫరా ఖాన్‌. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు తెలియజేశారామె. చైతూతో దిగిన ఫొటోను పంచుకుంటూ గత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ‘25 ఏళ్ల క్రితం వీళ్ల నాన్న అక్కినేని నాగార్జునతో ఓ పాటకు పనిచేశాను. అప్పటి నుంచి ఆయన మంచి స్నేహితుడయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ వండల్‌ఫుల్‌ అబ్బాయి నాగ చైతన్యతో కమర్షియల్‌ యాడ్‌ తెరకెక్కించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె తెలిపారు. అఖిల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సిసింద్రీ’ చిత్రంలోని పాటకు కొరియోగ్రఫీ చేశారు ఫరాఖాన్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని