‘అనుకోని అతిథి’ టైటిల్‌ సాంగ్ పుల్‌ వీడియో  

ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి కలిసి న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’. తెలుగులో ‘అనుకోని అతిథి’గా వచ్చింది. వివేక్‌ దర్శకత్వ వహించారు. 2019లో థియేట‌ర్ల‌లో విడుదలై ప్రేక్ష‌కుల్ని మెప్పించిన ఈ సినిమా డిజిట‌ల్ మాధ్య‌మైన ‘ఆహా’ ఓటీటీ వేదికగా మే 28న విడుదలైంది.

Published : 04 Jun 2021 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి కలిసి న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’. తెలుగులో ‘అనుకోని అతిథి’గా వచ్చింది. వివేక్‌ దర్శకత్వ వహించారు. 2019లో థియేట‌ర్ల‌లో విడుదలై ప్రేక్ష‌కుల్ని మెప్పించిన ఈ సినిమా డిజిట‌ల్ మాధ్య‌మైన ‘ఆహా’ ఓటీటీ వేదికగా మే 28న విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ సినిమాకి సంబంధిన టైటిల్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియో యూట్యూబ్‌లో వచ్చేసింది. టైటిల్‌ సాంగ్‌కి చరణ్‌ అర్జున్‌, మామిడికాల్వ మధు సాహిత్యం అందించగా మౌనికా రెడ్డి ఆలపించారు. పీఎస్‌ జయహరి సంగీతం స్వరాలు సమకూర్చారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతాన్ని అందించారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యం తెరకెక్కిన ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించగా రెంజీ పానికర్, శాంతి కృష్ణ, సురభి, సుదేవ్ నాయర్, నందు, లీనా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని