RRR:  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే!

RRR: ‘ఆర్ఆర్‌ఆర్‌’, గంగూబాయి కథియావాడి చిత్రాలు ఓటీటీలో విడుదలవుతాయని వస్తున్న వార్తలను నిర్మాణసంస్థపెన్‌ స్టూడియో ఖండించింది.

Published : 08 Sep 2021 15:18 IST

ముంబయి: కరోనా కారణంగా ఏ చిత్రాలు థియేటర్లలో విడుదలవుతాయో.. ఏవి ఓటీటీ బాట పడుతాయో అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఇటీవల బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ ‘బెల్‌బాటమ్’ థియేటర్లలో పలకరించింది. సినిమాకి స్పందన బాగా వచ్చినప్పటికీ కలెక్షన్ల దగ్గర మాత్రం అంత హవా చూపించలేకపోయింది. దీంతో రాబోయే పెద్ద చిత్రాలు ఎందులో విడుదలవుతాయే సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో అలియా భట్‌  ‘గంగూబాయి కథియావాడి’, రామ్‌చరణ్‌ -ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, జాన్‌అబ్రహం ‘అటాక్‌’ ఓటీటీ బాట పడుతున్నాయని వచ్చిన వార్తలు వచ్చాయి. అయితే ఇవన్ని వదంతులేనని.. ఇవన్నీ థియేటర్లలో విడుదల కానున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది ఈ చిత్రాల నిర్మాణంలో భాగమైన ‘పెన్‌ స్టూడియోస్‌’ సంస్థ. ఈ సందర్భంగా పెన్‌ స్టూడియోస్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ జయంతిలాల్‌ గాడా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘గంగూబాయి కథియావాడి, ఆర్‌ఆర్‌ఆర్‌, అటాక్‌ చిత్రాలన్నీ థియేటర్లలోనే విడుదలవుతున్నాయి. ఈ మూడు సినిమాలు ఓటీటీలో విడుదలవుతాయని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలన్నీ పెద్ద స్ర్కీన్‌లో ఆస్వాదించాలనే ఉద్దేశంతో నిర్మించినవి. కాబట్టి అవన్నీ థియేటర్లలోనే రిలీజ్‌ అవుతాయి’’ అంటూ ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని