అప్పుడే 60ఏళ్లు.. నమ్మలేకపోతున్నా: బాలకృష్ణ

అభిమానులు, ప్రేక్షకుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు...

Updated : 10 Jun 2020 15:33 IST

హైదరాబాద్: అభిమానులు, ప్రేక్షకుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన తన 60వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆసుపత్రిలో తన తల్లిదండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి.. వారికి నోట్‌ పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.  ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...‘‘నాకు అప్పుడే 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు. మద్రాసులో పుట్టిన నేను ఆరేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు వచ్చాను. అందరి కృషితోనే  ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రిలో పరిస్థితి బాగుంది. ఎందరో దాతల విరాళాలతో క్యాన్సర్‌ రోగులకు మంచి చికిత్స అందిస్తున్నాం. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి త్వరలో మనల్ని వీడి పోవాలని కోరుకుంటున్నా. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించాలి’’ అని బాలకృష్ణ అన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని