లాక్‌డౌన్‌ తర్వాత హీరోహీరోయిన్‌ కౌగిలింత ఇలా!

సినిమాల్లోనే కాదు.. పనిలోనూ, ప్రవర్తనలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించే దర్శకుడు రవిబాబు. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘క్రష్‌’. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా షూటింగ్‌లకు అనుమతి రావడంతో చిత్రీకరణ ఆరంభించారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి....

Updated : 08 Dec 2022 17:25 IST

షూటింగ్ ఆరంభించిన తొలి చిత్రమిది

హైదరాబాద్‌: సినిమాల్లోనే కాదు.. పనిలోనూ, ప్రవర్తనలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించే దర్శకుడు రవిబాబు. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘క్రష్‌’. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా షూటింగ్‌లకు అనుమతి రావడంతో చిత్రీకరణ ఆరంభించారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి సినిమా షూట్‌ ఇదేనని ఈ సందర్భంగా రవిబాబు అన్నారు. ఈ మేరకు సెట్‌లో వీడియో విడుదల చేశారు. హీరో హీరోయిన్‌ కౌగిలించుకునే సన్నివేశాన్ని తెరకెక్కించామని చెప్పారు. ‘హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు.. హీరోయిన్‌ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరు గట్టిగా హగ్‌ చేసుకుంటారు’ అంటూ రవిబాబు మధ్యలో గాజు గోడను పెట్టారు. రొమాంటిక్ సన్నివేశంలోనూ భౌతికదూరాన్ని పాటిస్తున్నామని ఆ సన్నివేశం ద్వారా ఆయన స్పష్టం చేశారు.

రవిబాబు గత ఏడాది ‘అదుగో’, ‘ఆవిరి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాల్లోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించారు. దర్శకత్వం కూడా వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని